<p>నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా, పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బెంగుళూరులో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ మాట్లాడారు.</p>