నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ కెరీర్ 108వ మూవీ గా గ్రాండ్ గా లెవెల్లో దీనిని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో బజ్ గా మారింది. ఈ ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో తమన్నా భాటియా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది పక్కా ఫేక్ న్యూస్ మాత్రమే అని NBK 108 టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి రానున్న దసరా కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకురానున్నారు.
The post first appeared on .