కామికా ఏకాదశి ఉపవాసం చేయడం ఎలా? ఎప్పుడు విరమించాలి పూర్తి వివరాలు
ఆషాడ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెల పవిత్రత కారణంగా ఈ నెలలో వచ్చే ప్రతి పండుగ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా చాలా ప్రత్యేకమైనది. ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడానికి అంకితం చేయబడింది. ఈ కాలంలో కఠోర వ్రతాన్ని ఆచరించిన వారికి రెట్టింపు పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఇది ఆషాడ మాసంలో వస్తుంది కనుక కామిక ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివుడిని ఆరాధించడం వలన అతని అనుగ్రహం లభిస్తుంది.
ఆషాడ మాసంలో వచ్చే కామికా ఏకాదశి వ్రతం గురించి మానవులు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పొందే దానికంటే కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ఎక్కువ ఫలితం దక్కుతుందని శ్రీ మహా విష్ణువు స్వయంగా చెప్పాడు. కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం చేయడం వలన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. కొన్ని పురాణాల ప్రకారం కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గొప్ప సంతానం కలుగుతుంది. కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మరు జన్మ రాదని విశ్వాసం. శాస్త్రాల ప్రకారం సరైన పద్ధతిని, నియమాలను పాటిస్తూ సరైన సమయంలో కామికా ఏకాదశి వ్రతం ఆచరించినప్పుడే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది.
కామిక ఏకాదశి రోజు భక్తి శ్రద్దలతో చేసే పూజతో కోరికలు నెరవేరతాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించిన భక్తులకు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. కామికా ఏకాదశి వ్రతం గురించి, బ్రహ్మ దేవుడు దేవర్షి నారదునితో చెబుతూ పాపాలకు భయపడేవారు కామిక ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలని చెప్పారు.
అటువంటి పరిస్థితిలో ఎవరైనా శ్రీహరితో పాటు శివయ్య అనుగ్రహాన్ని పొందడానికి కామికా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించబోతున్నట్లయితే.. కామికా ఏకాదశి ఉపవాసాన్ని విరమించే సరైన సమయం, విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.
2024 కామికా ఏకాదశి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ 30 జూలై 2024న సాయంత్రం 4:44 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తేదీ 31 జూలై 2024 మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం కామిక ఏకాదశి ఉపవాసం 31 జూలై 2024న ఆచరించాలి.
కామికా ఏకాదశి పూజ ముహూర్తం 2024
31 జూలై 2024 ఉదయం 05:42 am నుంచి 07:23 శుభ సమయం కాగా.. అమృత సమయం లేదా ఉత్తమ సమయం 07:23 am నుంచి ఉదయం 09:05 గంటల వరకూ అంతేకాదు ఏకాదశి పూజకు ఉత్తమ సమయం ఉదయం 10:46 am నుంచి మధ్యాహ్నం 12:27 వరకూ పూజ సమయం.
కామికా ఏకాదశి పారాయణ సమయం
ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి రోజున ఏకాదశి ఉపవాసం విరమిస్తారు. అటువంటి పరిస్థితిలో కామికా ఏకాదశి వ్రతం 1 ఆగస్టు 2024న విరమించాల్సి ఉంటుంది.
కామికా ఏకాదశి వ్రత విరమణ సమయం 1వ తేదీ ఆగస్టు 2024న ఉదయం 05:43 నుంచి 08:24 వరకు.
కామికా ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలంటే
ద్వాదశి తిథి రోజున కామికా ఏకాదశి వ్రతం విరమించాల్సి ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో ద్వాదశి తిథి నాడు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. అంత వరకూ ఏమీ తినకూడదు.
ఏకాదశి వ్రతం కేవలం శుభ ముహూర్తంలో మాత్రమే విరమించాలి లేదా ద్వాదశి తిథి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి.
ద్వాదశి తిథి ముగిసేలోపు వ్రతం విరమించకపోతే ఉపవాసం, పూజల ఫలితాలు ఫలించవు.
ఏకాదశి వ్రతం విరమించే ముందు విష్ణువును పూజించి, దానం చేసి ఆవు నెయ్యితో చేసిన ఆహారాన్ని తినాలి.
ఏకాదశి వ్రతం విరమిస్తూ తినే ఆహారం సాత్వికంగా ఉండాలి.
ఏకాదశి వ్రతాన్ని విరమించే సమయంలో తప్పకుండా అన్నం తినాలి.
ఏకాదశి వ్రతంలో నియమాలు పాటించకపోవడం వల్ల జనన మరణ బంధాల నుంచి విముక్తి లభించదని.. ఎన్నో జన్మలెత్తి కష్టాలు పడాల్సి వస్తుందని నమ్మకం.
కామిక ఏకాదశి రోజున ఏమి చేయాలంటే
కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవికి మరు జన్మ ఉండదని మత విశ్వాసం. అటువంటి పరిస్థితిలో ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఆయనకు ఇష్టమైన పూలు, పండ్లు, నువ్వులు, పాలు, పంచామృతం మొదలైన వాటిని సమర్పించండి. అంతేకాదు ఉపవాసం ఉన్నవారు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నారాయణుని ధ్యానిస్తూ ఉండాలి. ఈ రోజు పేదలకు భోజనం పెట్టడం, దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
కామికా ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారం
శ్రేయస్సు కోసం: కుటుంబంలో ఏదైనా కలహాలు ఉంటే, కామికా ఏకాదశి రోజున, పూజ సమయంలో, దక్షిణావర్తి శంఖంలో నీటిని నింపి విష్ణువుకు సమర్పించాలి. పూజ తర్వాత, ఆ నీటిని మొత్తం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచండి. దీంతో కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని విశ్వసిస్తారు.
అప్పులు తొలగిపోవాలంటే: కామిక ఏకాదశి రోజు సాయంత్రం రావి చెట్టుకు నీళ్ళు సమర్పించి దాని కింద నెయ్యి దీపం వెలిగించాలి. మహావిష్ణువు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
కామికా ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత
ఏకాదశి వ్రతం ఆచరించిన భక్తులపై శ్రీ హరి అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కామికా ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించాలి. అదే సమయంలో విష్ణువు పూజలో తులసి దళాలను చేర్చండి, లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. మత విశ్వాసం ప్రకారం కామిక ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల అకాల మరణ భయం ఉండదు.
కామిక ఏకాదశి రోజున ఉపవాసం, పూజలు, దానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలు హరిస్తాయని స్కాంద పురాణంలో వివరించబడింది. శివుడు విశ్వానికి లయకారుడు.. విష్ణువు ప్రపంచాన్ని సంరక్షించేవాడు. శివ విష్ణువుల అనుగ్రహంతో మనిషి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. కనుక కామిక ఏకాదశి నాడు శివుడు, విష్ణువును పూజించడం ద్వారా మనిషుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
TAGS: కామిక ఏకాదశి, Kamika Ekadashi, Kamika Ekadashi 2024, Kamika ekadashi 2024 telugu, Kamika Ekadashi significance, Kamika ekadashi 2024 Telugu, Kamika ekadashi 2024 iskcon, Kamika ekadashi 2024 time, Kamika Ekadashi story, Kamika Ekadashi in Telugu