2024 దసరా నవరాత్రుల తేదీలు & దుర్గ పూజ కలశ స్థాపన శుభ ముహూర్తం సమయం | Devi Navaratrulu 2024 Dates and Pooja Time

naveen

Moderator

హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులు ఉన్నాయి.. ఒకటి చైత్ర నవరాత్రులు.. మరొకటి శారదీయ నవరాత్రులు అంతేకాదు ఏడాదిలో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటారు. శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది.



ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి, ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు, దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని.. విశేషమైన ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.



శరన్నవరాత్రి ఉత్సవాలు 2024 ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.



కలశ స్థాపన ముహూర్తం 2024

నవరాత్రులలో మొదటి రోజు అంటే అక్టోబర్ 3న కలశ స్థాపనతో పాటు దుర్గామాత దేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం ఘట స్థాపన అంటే కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుంది. దీనితో పాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది. అది అభిజిత్ ముహూర్తం. ఇది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాళ కోసం కలశాన్ని ప్రతిష్టించ వచ్చు.



దుర్గా అష్టమి 2024 ఎప్పుడు?

ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షం అష్టమి తిథి రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వచ్చింది. ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు.



అక్టోబర్ 3న శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

శ్లోకం:

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం

పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌

నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః

నవరాత్రులు.. అమ్మవారి రూపాలు.. ఏ రోజున ఏ పూజ చేయాలంటే..

నవరాత్రుల మొదటి రోజు - అక్టోబర్ 3న 2024- ప్రతిపాద, ఘటస్థాపన, మా శైలపుత్రి పూజ.

శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక, తలపై చంద్రరేఖని ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది.



అక్టోబర్ 4న బ్రహ్మచారిణి ( గాయత్రి )

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

నవరాత్రుల రెండో రోజు - అక్టోబర్ 4న 2024 - బ్రహ్మచారిణి పూజ

దుర్గమ్మ రెండో అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. కన్యాకుమారి అనే మరోపేరుంది.



అక్టోబర్ 5న చంద్రఘంట ( అన్నపూర్ణ )

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

నవరాత్రుల మూడవ రోజు- అక్టోబర్ 5న 2024 - చంద్రఘంట పూజ

అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది.. అందుకే ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.



అక్టోబర్ 6న కూష్మాండ ( కామాక్షి )

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

నవరాత్రుల నాలుగవ రోజు - అక్టోబర్ 6న 2024 - మా కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం

నవదుర్గల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా అంటారు.



అక్టోబర్ 7న స్కందమాత ( లలిత )

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

నవరాత్రుల ఐదవ రోజు - అక్టోబర్ 7న 2024 -పంచమి, మా స్కందమాత పూజ

నవదుర్గల్లో ఐదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. కమలాసనంపై పద్మాసనంతో శోభిల్లుతుంది. నమ్మిన భక్తులకు విజయాన్నందిస్తుంది.



అక్టోబర్ 8న కాత్యాయని (లక్ష్మి)

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా |

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

నవరాత్రుల ఆరో రోజు - అక్టోబర్ 8న 2024, 6వ- షష్ఠి, మాతా కాత్యాయని పూజ

అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక మేరకు కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. కొత్స కుమార్తె కనుకే కాత్యాయని అనే పేరు వచ్చింది.



అక్టోబర్ 9న కాళరాత్రి ( సరస్వతి )

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

నవరాత్రుల ఏడవ రోజు - అక్టోబర్ 9న 2024- సప్తమి, మా కాలరాత్రి పూజ

దుర్గమ్మ ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.



అక్టోబర్ 10న మహాగౌరి ( దుర్గ )

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

నవరాత్రుల 8వ రోజు - అక్టోబర్ 7న 2024 - దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ, మహానవమి

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.



అక్టోబర్ 11న సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

నవరాత్రుల తొమ్మిదో రోజు - అక్టోబర్ 11న 2024 - మహానవమి, శరన్నవరాత్రుల పరణ

దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.



శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి|

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

శరన్నవరాత్రుల పదో రోజు - అక్టోబర్ 12న 2024 - దశమి, దుర్గా దేవీ నిమజ్జనం



నవరాత్రి పూజ విధానం:

అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రులలో మొదటి రోజున సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గాదేవికి పండ్లు, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి. నవరాత్రుల్లో ప్రతిరోజూ దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చేయండి. దీని తరువాత మీ సంప్రదాయం ప్రకారం, అష్టమి లేదా నవమి రోజున, అమ్మవారిని పూజించి.. తొమ్మిది మంది అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా పూజించండి.

ఆడపిల్లలకు పూరీ, శనగలు, పాయసం మొదలైన వాటిని ఆహారంగా పెట్టండి. మీ శక్తికి తగ్గట్టు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని, గౌరవంగా పంపించండి. ఆ తర్వాత ఉపవాసం విరమించండి.


Tags: Devi navaratri 2024 date, Devi navaratri 2024 date and time, Dussehra 2024 date and Time, Durga Puja 2024, Vijayawada dashami date 2024 holiday, Dussehra 2024, Vijayawada, Kanaka durga
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock