108 వైష్ణవ దివ్యదేశాలలో | ప్రధమ దివ్యక్షేత్రం | 108 Divya Desam Temples "Srirangam" (Bhoga Mandapam) Information

naveen

Moderator

" శ్రీరంగం " ( భోగ మండపం)





🌿శ్రీరంగం ......శ్రీ రంగనాథ స్వామి.

అమ్మవారు....శ్రీ రంగనాయకి.

🌸 కావేరి నదీ తీరం నుంచి పెన్నా నదీ తీరం వరకు గల భూభాగం ను చోళులు పాలించారు. వీరి పాలించిన భూప్రాంతమును " చోళనాడు "గా పిలుస్తారు. శ్రీ రంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో 40 వైష్ణువ ఆలయాలుకు ఆళ్వార్లు మంగళాశాసనములు అందించినారు.



🌿వీటిని చోళనాడు దివ్యదేశాలుగా పిలుస్తారు. వీటిలో ప్రధానమైనది "శ్రీరంగం". ఇది శ్రీ వైష్ణువులకు ప్రధాన కేంద్రం. శ్రీ వైష్ణువులు " తిరువరంగం " కొలుస్తారు.



🌸 శ్రీరంగం ఆలయం కావేరి నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది. శ్రీ మహా విష్ణువు యొక్క ఎనిమిది స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాలలో (స్వయం వ్యాక్త క్షేత్రాలు) శ్రీరంగం అగ్రస్థానం పొందింది. ఇది 108 దివ్యదేశాలు మొదటిది మరియు అతి ముఖ్యమైనది.



🌿ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోగ వైకుండం, భోగమండబం అని కూడా పిలుస్తారు. వైష్ణవ పరిభాషలో “కోయిల్” అనగా ఆలయం.



🌸 శ్రీరంగం ఆలయం 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీనికి 7 ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారాలలో 21 అద్భుతమైన గోపురాలున్నాయి.



🌿వీటితో పాటు 55 ఉపాలయాలు, భగవత్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి ,, 12 మంది ఆళ్వార్లు సన్నిధిలు ఉంటాయి.

ప్రపంచంలో మొట్టమొదటి స్వయంవ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు ..



🌸ఇక్ష్వాకు వంశం వారిచే కొనబడిన శ్రీరంగనాథుడి విగ్రహం శ్రీ రామచంద్ర మూర్తి చే విభీషణుడికి ఇవ్వబడింది. శ్రీరంగని విగ్రహాo తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు...



🌿కావేరి నది తీరంలో సంధ్యావందనాన్నికి విగ్రహాన్ని కింద పెట్టడం జరిగింది. మాయా ప్రభావంతో ఆ విగ్రహం అక్కడే స్థాపితం అయిపోయింది... విభీషణుడు ఎంత బతిమాలినా శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు కానీ విభీషణుడి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నదీ తీరంలో వెలసి యున్నాడు.



🌸ఈ రోజుకి విభీషణుడు మాయా స్వరూపంతో శ్రీరంగం వచ్చి శ్రీ రంగనాథ దర్శనం చేసి వెళుతుంటాడు అని అక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది.



🌿 శ్రీవైష్ణవం పుట్టి , ప్రకాశించి, అభివృద్ధి చెందిన ప్రదేశం .........శ్రీరంగం.

శ్రీ యమునాచార్యులు వారు దేహత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం.......... శ్రీరంగం



🌸 రామానుజాచార్యుల వారి దివ్య శరీరం 1000 సంవత్సరాలు నుండి ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిచ్చు క్షేత్రం.......శ్రీరంగం



🌿 స్వామి ని ఆండాల్ ( గోదాదేవి) అమ్మవారు పూజించి , తరించి, స్వామి లో ఐక్యమైన క్షేత్రం .........శ్రీరంగం

కంబ రామాయణం పుట్టిన ప్రదేశం.......శ్రీరంగం



🌸ఒళ్ళు గగుర్పొడిచే విధంగా .....ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.... తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనంకి ...

స్వామివారి పట్టపుటేనుగు " ఆండాళ్ " తో మేలుకొలుపు పాడించుకునే క్షేత్రం ..........శ్రీరంగం.




🌿 శ్రీ రంగనాథ స్వామి వారి సుప్రభాతం సేవ అగు విశ్వరూప దర్శనంని చూసి తరించి, అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించడానికి వీలు కాని అద్భుతమైన సన్నివేశం అది.....



🌸 365 రోజులు దాదాపు ప్రతి రోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం ........శ్రీరంగం.

ప్రపంచంలోని పెద్దదైన గరుడాళ్వార్ సన్నిధి కల పుణ్యక్షేత్రం........ శ్రీరంగం



🌿 గర్భాలయంలో పంచముఖ ఆదిశేషువు పైన శయన ముద్రలో శ్రీ రంగనాథ స్వామి దర్శనమిస్తాడు. ఉత్సవమూర్తిని 'నంబెరమాళ్' గా సేవించుతారు. ప్రధానాలయం వెనుక భాగములో అమ్మవారి ఆలయం కలదు.



🌸శ్రీ రంగనాయికి తాయారుకు నిత్య సేవలు జరుగుతాయి. తమిళ చిత్తిరై (చైత్రం) మాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతాయి.



🌿 వైకుంఠ ఏకాదశి సందర్భముగా 20 రోజులు పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి...



🌸రేపు రెండవ దివ్య క్షేత్రం విశేషాలు తెలుసుకుందాము స్వస్తి...🌞🙏🌹🎻



🌿శ్రీరంగ రంగ రంగా...

కావేటి రంగ రంగా..

జై శ్రీమన్నారాయణ..

ఓం నమో వేంకటేశాయ..



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿




 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock