ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ భారీ చిత్రం “ఆదిపురుష్” రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ చిత్రం తర్వాత “సలార్” రానుంది. ఇక ఈ చిత్రాలు తర్వాత రిలీజ్ రేస్ లో ఉన్న పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే”. దర్శకుడు నాగశ్విన్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో అయితే తెరకెక్కిస్తున్నారు.
మరి షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవుతూ వస్తున్నా ఈ సినిమా షూట్ కొత్త షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ మే 26 న అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కే సెట్స్ లోకి మళ్ళీ అడుగు పెట్టనున్నాడట. దీనితో అక్కడ నుంచి కొన్ని రోజులు షూట్ కొనసాగనుంది. ఇక ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొనె లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
The post first appeared on .