మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ సినిమా అయినటువంటి “ఆరెంజ్” ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్లాప్ అయ్యినప్పటికీ ఈ చిత్రం రీ రిలీజ్ లో ఎలాంటి ప్లానింగ్ లేకుండానే వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని భాస్కర్ కె దర్శకత్వం వహించగా నాగేంద్రబాబు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే..
మరి ఈ చిత్రం రీ రిలీజ్ వసూళ్లు అయితే మొదట్లోనే పవన్ జనసేన పార్టీ కి డొనేషన్ గా ఇవ్వడం జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం రీ రిలీజ్ లో కీలక పాత్ర పోషించిన “బేబీ” దర్శకుడు సాయి రాజేష్, ఆ చిత్ర నిర్మాత, మెగా అభిమాని అయినటువంటి ఎస్ కె ఎన్ లు నాగబాబు ను పవన్ పార్టీ ఆఫీస్ లో కలిసి నాగబాబుతో అయితే మొత్తం ఒక కోటి 5 లక్షల రూపాయలను అయితే డొనేషన్ ని అందించారు.
మరి నాగబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ చరణ్ బాబు ఆరెంజ్ సినిమా రీరిలీజ్ అయ్యాక అన్ని ఖర్చులు పోను తమ పార్టీకి 1.05 కోట్లు డొనేట్ చేస్తున్నామని ఇందుకు సహకరించినందుకు ముఖ్యంగా చరణ్ కి అలాగే చరణ్ అభిమానులకి కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నానని నాగబాబు తెలిపారు.
The post first appeared on .