కార్తీక పురాణం
శివకేశవుల మాసం.. కార్తికం!
శివకేశవులకు ప్రీతికరమైన మాసం… ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం… మనిషిని సంఘజీవిగా మలిచే మాసం… ఇలా చెప్పుకుంటూ పోతే కార్తిక మాసానికి ఎన్ని విశేషాలో. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే.
30 రోజులు పర్వదినములకు సంబంధించిన కార్తీక పురాణం ను 30 అధ్యయములుగా ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా కార్తీక సంపూర్ణ మహా పురాణం తెలుగు పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి. 30 రోజులు 30 అధ్యయనాలు పారాయణం చేయండి.
Sampurna Kartika Maha Puranam pdf
అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి.. పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి..కార్తీక పురాణం ఎలా పఠించాలో ఇప్పడు తెలుసుకుందాం.
ముప్పై రోజులు ఉండే కార్తీకమాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంలో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీకపురాణాన్ని ప్రతిరోజు ఒకో అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీకపురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుడిని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం. తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన కృత యుగం కాల ప్రజల అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు .. పార్వతీ దేవికి, బ్రహ్మ ..నారధుడికి, మహావిష్ణువు.. లక్ష్మీ దేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి .. జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తృతంగా తెలియపరిచాడని ప్రతీతి.
కార్తీక పురాణం ఎలా చదవాలి?
కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని, ఉపవాసం ఉండే వారు నియమాలు ప్రకారం ఉపవాసం ఉండి తరువాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని దగ్గరలో ఉన్న శివాలయం, లేదా ఏదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని అటు తరువాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణం లో పేర్కొన్నట్టు రోజుకొక ఆధ్యాయం చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిఘాడార్థం, దాని తాలూకూ విషయం, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణం ప్రతీ కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పు చోటుచేసుకుంటుంది.కాబట్టి కార్తీకమాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మరవకండి. సాధారణ రోజులకంటే ఎంతో గొప్ప పలితాన్ని ఈ మాసంలో పొందవచ్చుని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మహా పురాణం 30 రోజులు 30 అధ్యయనాలు
karthika puranam pdf download, karthika puranam 1st day to 30 days stories. karthika puranam in telugu, Sampurna Kartika Maha Puranam pdf, Karthika Maha Puranam Telugu, Karthika Mahapuranam Telugu Pdf Book