శ్రీవారి ఆలయం చుట్టూ మహా ప్రదక్షిణ - Tirumala Sri Venkateswara Swamy Temple Maha Pradakshina

naveen

Moderator

శ్రీవారి ఆలయం చుట్టూ మహా ప్రదక్షిణ

ఆనందనిలయం సమూహము నుంచి.

తూర్పు మాడ వీధి :- స్వామి వారి మహాద్వారం ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది. మన ప్రదక్షణ ఎడమ చేతివైపుగా మొదలు పెడితే చివరిన సహస్ర దీపాలంకర సేవ మండపం ఉంటుంది. ఇది ఎప్పుడూ మూసివుంటుంది. సాయంత్రం మాత్రమే సహస్ర దీపాలంకర సేవ సమయంలో తెరవబడుతుంది. ఈ మండపం పైన హతిరాంజి మఠం ఉంటుంది.



దక్షణ మాడ వీధి : ఎడమ చేతి వైపు సుపథం ఎంట్రెన్స్ మెట్లు కనపడతాయి. అవి దాటుకుని వెళితే పైన మూవింగ్ బ్రిడ్జి కనపడుతుంది. ఇక్కడే సీనియర్ సిటిజన్స్, దివ్యంగుల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల దర్శనం మొదలు. ఆ ప్రక్కనే వృక్షాల నీడలో తిరుమల నంబి ఆలయం ఉంటుంది. అలా సరాసరి వెళ్లి కుడి చేతివైపు తిరిగేతే పడమర మాడ వీధిలోకి ప్రవేశిస్తాము.

పడమర మాడ వీధి :- ఇక్కడ మనకు చిన జీయంగారి మఠము, అర్చకుల క్వార్టర్స్ కనపడతాయి. అలా సరాసరి వెళ్లి కుడి చేతివైపు తిరిగేతే ఉత్తర మాడ వీధిలోకి ప్రవేశిస్తాము.



ఉత్తర మాడ వీధి :- ఈ వీధిలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయం,వైఖాసన అర్చక నిలయం,స్వామి పుష్కరిణి,వరాహస్వామి ఆలయం,వ్యాసరాజ మండపం,విఖసన మహర్షి ఆలయం,దాని ప్రక్కనే రాధాగోపాల ఆలయం, దాని ప్రక్కనే హయగ్రీవ స్వామి వారి ఆలయం ఉంటుంది.మళ్ళీ కుడిచేతివైపు తిరిగేతే తూర్పు మాడవీధి లోకి ప్రవేశిస్తాము.అలా సరాసరి వస్తే మహాద్వారం ఎదురుగా వున్నా గొల్ల మండపం వద్దకు చేరుకుంటాము. దీనితో మహా ప్రదక్షణ పూర్తి అవుతుంది.



ఈ మహాప్రదక్షణలో స్వామివారి పుష్కరిణి, వరాహస్వామి ఆలయం,వ్యాసరాజ మండపం ఈ మూడు మీకు కుడి చేతివైపు కనపడతాయి. మిగిలినవి అన్ని ఎడమ చేతివైపు ఉంటాయి.

శనివారం స్వామి వారిని మనసులో తలచుకుని గోవిందా అనుకోండి చాలు..


Tags: Tirumala, Tirupati, TTD, Venkateswara Swamy, Tirumala Temple, Tirumala Tickets, Anga pradakshina Teckets, Tirumala Maha Pradakshina
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock