టాలీవుడ్ లో నటుడు నుండి, నిర్మాత మారిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్, తాజాగా సోషల్ మీడియా లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవర అనే టైటిల్ ను తాను రిజిష్టర్ చేసుకున్నది అని, తను మర్చిపోవడం వల్ల టైటిల్ ను కొట్టేశారు అంటూ చెప్పుకొచ్చారు. మరొక ట్వీట్ లో నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా, ఆయన కూడా నాకు దేవరే అని అన్నారు.
కొరటాల శివ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి దేవర అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అని సోషల్ మీడియాలో బజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ 30 వ సినిమాకి ఇదే టైటిల్ అని తెలుస్తోంది.
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే
— BANDLA GANESH. (@ganeshbandla)
The post first appeared on .