డిసెంబర్ నెలకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల - TTD to release Arjitha Seva tickets for December Month 2024

naveen

Moderator

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల దర్శనం టికెట్ వివరాలు:

సెప్టెంబర్ 19న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల..


తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.



ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబర్ 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.



సెప్టెంబర్ 22న వర్చువల్ సేవల కోటా విడుదల..

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

సెప్టెంబర్ 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు..

డిసెంబర్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.



శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా..

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్ ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.



సెప్టెంబర్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

డిసెంబర్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

సెప్టెంబర్ 24న తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌..

తిరుమల, తిరుపతిల‌లో డిసెంబర్ నెల గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల్ని వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.



సెప్టెంబర్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల

సెప్టెంబర్ 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Click here:


Tags: Tirumala Tirupati Devasthanams, Arjitha Sevas, Tirumala, TTD Issues Arjitha Seva Tickets, TTD, Tirupati Temple, TTD Arjitha Seva, TTD 300 Rs Tickets, TTD Online Tickets, TTD Online Tickets 2024, Tirumala Darshnam, Lucky Dip, Suprabhata seva, September 2024 TTD Tickets Release, TTD, Calendar 2024, May Month TTD Ticekets 2024,
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock