కార్తీకశుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు.. ఇలా చేయండి? 2024 Karthika Ekadasi Upavasam,Pooja

naveen

Moderator

కార్తీక శుద్ధ ఏకాదశి..

భోదన ఏకాదశి ..ఉత్థాన ఏకాదశి..

ఓం నమో కార్తీక దామోదరాయ నమః..

ఓం నమః శివాయ..

శ్రీ మాత్రే నమః..



కార్తీక శుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి..

దేవ - ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు.

ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి..

ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది.

దీనినే హరి - భోధిని ఏకాదశి అని కూడా అంటారు.

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.

మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు.

యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.



ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేసి ,

మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి ,

పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.



ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది.



ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది.

1000 అశ్వమేధ యాగాలు ,

100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు ,

తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది.. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం.



ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా , అది మేరు పర్వతానికి సమానమైన

పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు.



ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం , సంపదలు , ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపపరిహారం జరుగుతుంది.

పుణ్యక్షేత్ర దర్శనాలు , యజ్ఞయాగాలు ,

వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి

కోటిరెట్ల పుణ్యం...ఒక్కసారైన ఈ ఏకాదశి

ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది.



వస్త్రదానం చేయడం వలన , పండ్లు , దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలు , యక్షులు , కిన్నెరులు , కింపురుషులు , మహర్షులు , సిద్దులు , యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ , భజనలతోనూ..హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు.

అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు

శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో.

వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని

ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి.



అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి.

అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి ,

వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.

స్వామి అనుగ్రహం కలుగుతుంది.

సర్వే జనా సుఖినోభవంతు..


Tags: Karthika Ekadasi, kaathika suddha Ekadashi, Ekadashi,
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock