కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే! Karthika Masam 2024 Start And End Date

naveen

Moderator

కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం సహా కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే..

మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి? ఎందుకు ఇది పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో తెలుసుకుందాం.



అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీకమాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసం ఇది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అనే పేరు వచ్చింది.

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ భోళా శంకరుడి అనుగ్రహం పొందటం కోసం ప్రయత్నిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.



కార్తీక మాసం 2024 తేదీలు

తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలకు - 2024లో, కార్తీక మాసం ఆదివారం, నవంబర్ 2వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ముగుస్తుంది.

కార్తీకమాసంలో 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

1 నవంబర్ 2024, శుక్రవారం అమావాస్య , కేదార గౌరీ వ్రతం

2 నవంబర్ 2024, శనివారము గోవర్ధన పూజ, ఆకాశ దీప ప్రారంభం , చంద్రోదయం

3 నవంబర్ 2024, ఆదివారం యమ ద్వితీయ , భగినీహస్త భోజనం

4 నవంబర్ 2024, సోమవారం నాగుల చవితి , సోమవారం వృతం

5 నవంబర్ 2024, మంగళవారము నాగుల చవితి

7 నవంబర్ 2024, గురువారం స్కంద షష్టి , సూర్య షష్టి

9 నవంబర్ 2024, శనివారం దుర్గాష్టమి వ్రతం , గోపాష్టమి

12 నవంబర్ 2024, మంగళవారము క్షీరాబ్ది ద్వాదశి , కైశిక ద్వాదశి , చాతుర్మాస్య వ్రాత సమాప్తి , ప్రబోధిని ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి

13 నవంబర్ 2024, బుధవారము యోగేశ్వర ద్వాదశి, ప్రదోష వ్రతం, తులసి వివాహం

15 నవంబర్ 2024, శుక్రవారము గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

18 నవంబర్ 2024, సోమవారము సంకష్టహర చతుర్థి

26 నవంబర్ 2024, మంగళవారము ఉత్పన్న ఏకాదశి

27 నవంబర్ 2024, బుధవారము వైష్ణవ ఉత్పన్న ఏకాదశి

28 నవంబర్ 2024, గురువారము ప్రదోష వ్రతం

29 నవంబర్ 2024, శుక్రవారం మాస శివరాత్రి



కార్తీక సోమవారం తేదీలు

కార్తీక మాసం 2024లో నాలుగు సోమవారాలు (కార్తీక సోమవారం) ఉన్నాయి.

నవంబర్ 4

నవంబర్ 11

నవంబర్ 18

నవంబర్ 25

కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు.



కార్తీకమాసంలో ఈ పనులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

• లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసానికి దూరంగా ఉండాలి.

• కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి.

• విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి.. దైవదూషణ మాత్రం చేయకండి.

• దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి.

• మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం చేయకూడదు.

• కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు.



స్కంద పురాణంలో ఇలా ఉంది.

“న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం!

నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్”

“కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.



కాబట్టి:

ఈ ఏడాది నవంబరు 02 శనివారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 01 ఆదివారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది.


Tags: కార్తీక మాసం, Karthika Masam 2024, Karthika Masam, karthika masam start and end date 2024, karthika masam 2024 dates, lord shiva, karthika puranam
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock