ఆషాడ అమావాస్య రోజు చేయాల్సిన & చేయకూడని పనులివే .. | Things to do and not to do on Ashada Amavasya day..

naveen

Moderator

ఆషాడ అమావాస్య..!!

మన హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలా అమావాస్య, పౌర్ణమి అనేవి సాధారణంగా వస్తుంటాయి.

అయితే ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన మత విశ్వాసాల ప్రకారం, అమావాస్యను చెడుగా భావిస్తారు.



ఈరోజున శుభకార్యాలను జరపరు. ప్రయాణాలు కూడా చేయడాన్ని వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పనులను సైతం ఈ ఒక్కరోజు ఆపేస్తారు.

ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం 3 గంటల 31 నిముషాల నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి.

ఆగష్టు 04 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 54 నిముషాల వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి

పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారం అమావాస్య నియమాలు పాటిస్తారు..

ఈ ఆషాఢ అమావాస్య తిథి అన్నదాతలకు ఎంతో ముఖ్యమైన

ఈ పవిత్రమైన రోజున రైతులు తమ పొలాలు పచ్చగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.



అలాగే నాగలి మరియు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఈరోజున చాలా మంది శుభకార్యాలను చేయడాన్ని వాయిదా వేస్తారు.

ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలచుకుని, నది స్నానం చేసి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఇది మాత్రమే పితృ దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ రోజున పితృ కర్మకు చాలా పవిత్రంగా భావిస్తారు.

సరైన సమయానికి వర్షాలు కురిసి తమ పంటలన్నీ బాగా పండాలని అన్నదాతలు ఈ అమావాస్య రోజున దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం, అమావాస్య రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి.. మరి కొన్ని పనులను పొరపాటు చేయకూడదు.

ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య రోజున ఏమేమి చేయాలి.. ఏమేమి చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..



లక్ష్మీదేవిని పూజించాలి

ఆషాఢం అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీకు దరిద్రం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

అలాగే ఈ పవిత్రమైన రోజున కచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలి లేదా ప్రవహించే నీటిలోని తీసుకుని మీరు ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకుని స్నానం చేయాలి.

అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. పూర్వీకులను స్మరించుకోవాలి. అమావాస్య రోజున ఉపవాసం ఉండాలి. రాత్రిపూట పండ్లను లేదా పండ్ల రసాలను మాత్రమే తీసుకోవాలి.



ఇవి కూడా చేయాలి.

ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది.

ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి.

దీపారాధన..

ఆషాఢం అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దీప పూజలు చేస్తారు. ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయానంలోకి ప్రవేశిస్తాడు.

ఈ క్రమంలోనే చలి, చీకటి బాగా పెరుగుతాయి. అవి బద్ధకానికి, అనారోగ్యానికి, అజ్ణానానికి ప్రతీకలుగా పరిగణిస్తారు.

వీటిని తొలగించి వెలుగును పంచేవే దీపాలు. అందుకే ఈరోజున దీపారాధాన కచ్చితంగా చేస్తారు.



చేయకూడని పనులు..

ఆషాఢ అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించరాదు.

ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను చేయరాదు.

ఈ పవిత్రమైన రోజున మధ్యా్హ్నం రోజున నిద్ర పోకూడదు.

ఆషాఢ అమావాస్య రోజున షేవింగ్, కటింగ్ వంటివి చేసుకోకూడదు.

ఇప్పటికే ఏవైనా పనులు జరుగుతుంటే వాటిని ఆపడం వంటివి చేయొద్దు.

అమావాస్య రోజున పసిబిడ్డలను సంధ్యా వేళలో బయటికి తీసుకెళ్లకూడదు.

ఈరోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు స్వస్తి..


Tags: ashadha amavasya meaning, ashadha amavasya, ashadha amavasya time, ashadha amavasya 2022 date and time, ashadha amavasya telugu, ashadha amavasya, ashadham, amavasya, ashada amavasya 2024
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock