పండితుల అభిప్రాయం ప్రకారం, రోడ్డుపై మన కళ్ల ముందు అకస్మాత్తుగా డబ్బు కనిపించడం యాదృచ్ఛికం కాదు. అది పూర్వీకుల ఆశీర్వాదం, విశ్వం నుంచి వస్తున్న సానుకూల శక్తి అని చెప్పబడుతుంది. ముఖ్యంగా నాణెం కనిపిస్తే అది దేవుని ఆశీర్వాదం రూపంలో మీ జీవితంలో శుభ పరిణామాలు రానున్నాయన్న సూచన అంటారు.
వాస్తు నిపుణులు చెబుతున్నదేమిటంటే.. మీరు రోడ్డుపై నాణెం లేదా నోటు చూసిన వెంటనే దానిని తీసుకోవాలి. అది మీ అదృష్టాన్ని రాబోయే రోజుల్లో పెంచుతుందంటారు. అయితే ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టకూడదు. దానిని మీ పర్సులో, దేవుడి దగ్గర లేదా లాకర్‌లో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం. అది ధన సమృద్ధి పెరగడానికి శుభ సూచికంగా మారుతుంది.
అలాగే మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పనిమీద బయలుదేరినప్పుడు రోడ్డుపై నోటు లేదా నాణెం కనబడితే, ఆ రోజు మీకు ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం ఉంది. ఆ డబ్బును తీసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభం, మానసిక ప్రశాంతత, మరియు శుభఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు ఇది నా దానికాదు అని భావించి తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు దాన్ని దేవాలయంలో హుండీలో వేయడం లేదా పేదవారికి దానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. దాంతో కూడా అదే శుభఫలితాలు వస్తాయని చెబుతారు.
ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే, రోడ్డుపై కనిపించే డబ్బు యాదృచ్ఛికం కాదు అది ప్రపంచం మీతో ఒక సంకేతం పంచుకుంటోంది. మీరు దాన్ని స్వీకరించడం అంటే ఆ విశ్వం ఇచ్చే శుభఫలితాలను అంగీకరించడం. అందుకే ఇకమీదట రోడ్డుపై నాణెం లేదా నోటు కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. అది దేవుడు మీ వైపుకు పంపిన ఒక చిన్న అదృష్ట సంకేతం కావచ్చు. పర్సులో దాచుకోండి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
The post Vastu: రోడ్డుపై పడిఉన్న నాణాలు తీసుకుంటే ఏమవుతుంది.. అదృష్టమా.. దురదృష్టమా..? appeared first on Telugu Rajyam.