Parenting Tips: పడుకునే ముందు పిల్లలకు కథలు ఎందుకు చెప్పాలి?

Educator

New member

Parenting Tips:  మీ పిల్లలను నిద్ర పుచ్చడానికి ప్రతి రోజూ మీకు కథలు చెప్పే అలవాటు ఉందా? ఒకవేళ ఆ అలవాటు లేకపోతే కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… మీరు చేసే ఈ చిన్న పని మీ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది.

పిల్లలను నిద్ర పుచ్చడానికి పేరెంట్స్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కువగా పాటలు పాడి నిద్రపుచ్చుతూ ఉంటారు. పిల్లలు కొంచెం పెద్దవారు అయితే.... కథలు చెబుతారు. అయితే... ఈ పాటలు పాడటం, కథలు చెప్పడం కేవలం పిల్లలు హాయిగా నిద్రపోవడానికి మాత్రమే కాదు.. వారి మెదడు అభివృద్ధికి కూడా సహాయపడతాయి అని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. మెదడు అభివృద్ధి మాత్రమే కాదు.. వారిలో జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

2011లో ప్రీడియాట్రిక్స్ పత్రికలో ప్రచురితమైన ఒక ముఖ్యమైన అధ్యయనం ప్రకారం.. పడుకునే సమయంలో రెగ్యులర్ గా కథలు వినే పిల్లల్లో.. మిగిలిన పిల్లలతో పోలిస్తే...భాష నైపుణ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు... ఈ పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కథలు వినే పిల్లల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతం చాలా చురుకుగా పనిచేస్తుంది. దీని వల్ల వారి మెదడు చురుకుగా పని చేసి... ఎలాంటి సమస్యలను అయినా చాలా తొందరగా పరిష్కరించగల సామర్థ్యం పెరుగుతుంది.

కథలు చెప్పే సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో కలిగే ఎమోషనల్ బాండ్ కూడా మెదడు పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించి, మెదడుకు రిలాక్సేషన్ పెంచుతుంది. దీని వల్ల పిల్లలు చాలా హాయిగా నిద్రపోగలరు. మంచి నిద్ర కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

రాత్రి పడుకునే సమయంలో పిల్లలు కథలు వినడం వల్ల వారి క్రియేటివిటీ పెరుగుతుంది. కథలోని పాత్రలు, సంఘటనలను మనసులో ఊహించుకోవడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాకుండా.. సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం కూడా పెరుగుతుంది.

రోజూ నిద్రకు ముందు పిల్లలకు కథలు చెప్పడం లేదా చిన్న పాటలు పాడడం ద్వారా తల్లిదండ్రులు రెండు ప్రయోజనాలు పొందుతారు.

పిల్లలతో బలమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. పిల్లల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యాలు సహజంగా పెరుగుతాయి. అందుకే..తమకు సమయం లేదు అని సాకులు చెప్పకుండా... ప్రతిరోజూ రాత్రి కథలు చెప్పడానికి ప్రయత్నించాలి.

Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock