ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో, కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు నయన్. నిర్మాతగా, హీరోయిన్ గా బిజీగా ఉంది. ఇదిఇలా ఉంటే తాజాగా నయనతార సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన 22 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. మొదటి సారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడు అనుకోలేదు.
తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. నన్ను నన్నుగా మార్చాయి. నా ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ నోట్ ని విడుదల చేసింది. దీంతో ఆమె షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్లా అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
The post Nayanthara: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన నయనతార.. నన్ను మార్చేసాయి అంటూ! appeared first on Telugu Rajyam.