Mithra Mandali: ‘మిత్ర మండలి’ థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరిని నవ్విస్తుంది – నిహారిక ఎన్ ఎం

Educator

New member
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా విజయేందర్ దర్శకుడిగా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

‘మిత్ర మండలి’ కథను ముందుగా విన్నారా? ‘పెరుసు’ కథని ముందుగా విన్నారా? మీ మొదటి చిత్రం ఏది?
నేను ముందుగా ఈ ‘మిత్ర మండలి’ కథనే విన్నాను. కానీ ‘పెరుసు’ తమిళ చిత్రం ముందుగా రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

‘మిత్ర మండలి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘మిత్ర మండలి’ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.

ప్రియదర్శితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్‌లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలను చేయాలని అనుకుంటున్నారు?
నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ).

విజయం వచ్చినప్పుడు సంతోషించినట్టే.. పరాజయాలకు కృంగిపోతారా?
నేను పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.

తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. టాలీవుడ్ గురించి మీకు ఏర్పడిన అభిప్రాయం ఏంటి? ఎలాంటి చిత్రాల్ని మున్ముందు చేయాలని అనుకుంటున్నారు?
ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.

‘మిత్ర మండలి’ చిత్రం ఎలా ఉంటుంది? ఈ మూవీ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించి థియేటర్‌కు రావాలి?
‘మిత్ర మండలి’ చిత్రంలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది.

‘మిత్ర మండలి’ దర్శక, నిర్మాతల గురించి చెప్పండి?
తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్‌లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు.



Click here for Photogallery





The post Mithra Mandali: ‘మిత్ర మండలి’ థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరిని నవ్విస్తుంది – నిహారిక ఎన్ ఎం appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock