నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్ (Bison).
ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ..“ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం. నాకు తెలుగులో విడుదల చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు” అని అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో లిరిక్స్ రాయగా, ఎనమంద్రా రామకృష్ణ తెలుగు లిరిక్స్ అందించారు. మనువర్ధన్ పాటను పాడారు. తీరేనా తీరేనా.. గుండెల్లోన మండుతున్న మూగవేదన..” అంటూ సాగిన పాట సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో ధృవ్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.
The post Bison: విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న బైసన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times.