విరాట్ కోహ్లీకి ‘చీకూ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Educator

New member

Virat Kohli Chiku nickname: విరాట్ కోహ్లీకి ‘చీకూ’ అనే పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఈ పేరు వెనుక ఉన్న ఆసక్తికర సంఘటనను కోహ్లీ స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం.

టీమిండియా లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈరోజు తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో అతను సంపాదించిన కీర్తిని ఎవరూ ఊహించలేరు. అయితే,  కోహ్లీకి చాలా మంది, ముఖ్యంగా భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇష్టపడే నిక్ నేమ్ ఉంది. అదే చీకూ..

ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీని మీకు చీకూ అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించగా.. మొదట విరాట్ పెద్దగా నవ్వాడు. ఆ తర్వాత నిక్ నేమ్ వెనకున్న ఆ స్టోరీని చెప్పారు. ఒకసారి ఢిల్లీ జట్టు ముంబైలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. వీరేంద్ర సెహ్వాగ్, మిథున్ మన్హాస్, గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్లతో విరాట్ ఆడుతున్నారు.

అయితే, సాయంత్రం తాను కొత్త హెయిర్‌స్టైల్‌తో హోటల్‌కు తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లీ జుట్టు కత్తిరించుకున్న తర్వాత తన కొత్త లుక్ ఎలా ఉంది అని అందరినీ అడిగాడు. జట్టు అసిస్టెంట్ కోచ్ అజిత్ చౌదరి సరదాగా "నువ్వు చీకూ లాగా కనిపిస్తున్నావు" అని చెప్పారు. కోహ్లీకి ఆ పేరు చాలా నచ్చింది.. కోచ్ మాటలను ఎప్పుడూ చెడుగా భావించలేదు.

మ్యాచ్‌ల సమయంలో మహేంద్ర సింగ్ ధోని పదే పదే కోహ్లీని చీకూ పేరుతో పిలిచినప్పుడు ఈ పేరు మరింత గుర్తింపును పొందింది. స్టంప్‌ల వెనుక నుండి ధోని తరచుగా కోహ్లీని "చీకూ చీకూ" అని పిలిచేవాడు. ఆ క్లిప్ లు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. దీని తర్వాత, విరాట్ కోహ్లీ పేరుతోనే కాకుండా చీకూ అనే పేరుతో కూడా పిలవడం మొదలైంది.

విరాట్  అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్ అని చెప్పడంలో సందేహం లేదు. 305 వన్డేల్లో, అతను 57.71 సగటుతో 14,255 పరుగులు చేశాడు, 51 సెంచరీలతో టాప్ లో నిలిచాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అలాగే, 75 హాఫ్ సెంచరీలు సాధించాడు. 183 పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు.

నిజంగానే కోహ్లీ ఛేజ్‌మాస్టర్.. ఎందుకంటే వన్డేల్లో విజయవంతమైన పరుగుల వేటలో, విరాట్ అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డును కలిగి ఉన్నాడు, 108 మ్యాచ్‌ల్లో 89.29 సగటుతో 6,072 పరుగులు చేశాడు, ఇందులో 24 సెంచరీలు ఉన్నాయి.

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగుల మైలురాళ్లను చేరుకున్న ఆటగాడిగా అతను నిలిచాడు.

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో కోహ్లీ రెండవ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్. 37 మ్యాచ్‌ల్లో 59.83 సగటుతో 1,795 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కాగా, 2024లో టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని అతను తీసుకున్న నిర్ణయం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు, విరాట్ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు తరపున ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.

Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock