రోజూ 3 పూటలా అన్నమే తింటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Educator

New member

మనలో చాలామంది రోజూ మూడు పూటలా అన్నమే తింటుంటారు. అన్నం కాకుండా ఇంకేం తిన్నా కొందరికి కడుపునిండిన ఫీలింగ్ రాదు. అన్నం తక్షణ శక్తినిస్తుంది నిజమే. కానీ 3 పూటలా అన్నమే తింటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మన ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నం మన శరీరానికి శక్తినిచ్చే ప్రధాన కార్బోహైడ్రేట్. ముఖ్యంగా వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకు మూడు పూటలా కేవలం అన్నమే తింటే మన శరీరానికి శక్తి లభించినా, సమతుల ఆహారం అందదు. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అధిక కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌గా మారి.. కొవ్వుగా పేరుకుపోతాయి. దానివల్ల ఊబకాయం వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలంటే అన్నం తినడం తగ్గించాలి. రోజుకు మూడు సార్లు అన్నం తింటూ వ్యాయామం చేయకపోతే, శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి.. పొట్ట భాగంలో ఫ్యాట్ పేరుకుపోతుంది.

వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచేస్తుంది. దీని ఫలితంగా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రోజూ మూడు పూటలా వైట్ రైస్ తినకపోవడమే మంచిది.

వైట్ రైస్ ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. దీంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఫైబర్ లేమి వల్ల జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దానివల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా అన్నం తిన్న వెంటనే శక్తి వస్తుంది కానీ అది ఎక్కువసేపు ఉండదు. వైట్ రైస్ త్వరగా గ్లూకోజ్‌గా మారిపోతుంది. దానివల్ల వెంటనే ఆకలి వేస్తుంది. ఫలితంగా మళ్లీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అంతేకాదు అన్నం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే వైట్ రైస్ తినకపోవడమే మంచిది.

మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అన్నీ సరైన మోతాదులో అవసరం. కానీ అన్నంలో ఇవి చాలా తక్కువ. కాబట్టి కేవలం అన్నమే తింటే శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D వంటి ముఖ్య పోషకాలు అందవు. దీని వల్ల బలహీనత, అలసట, రక్తహీనత, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ వైట్ రైస్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.

అన్నం పూర్తిగా మానేయాలా?

అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం మన ఆహారంలో ఉండాలి కానీ సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. ఉదయం లేదా మధ్యాహ్నం ఒకపూట అన్నం తిని.. మరో రెండు పూటలు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే అన్నం తినేప్పుడు పప్పు, కూర, పెరుగు, సలాడ్ వంటివి తప్పకుండా ఉండాలి. రోజూ 30–45 నిమిషాల వ్యాయామం, తగినంత నీరు, మంచి నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock