భారత దేశంలో తప్పక చూడవలసిన దత్తాత్రేయ క్షేత్రములు..!! Famous Lord Dattatreya Temples In India

naveen

Moderator

మన భారత దేశంలో దత్త క్షేత్రములు..!!

దత్తావతారం..


1. పిఠాపురం

దత్తుని ప్రదమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..



2. కురువపురం

ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం..

ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.



3. గోకర్ణము

ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.



4. కరంజా

రెండవ దత్త అవతారం,

నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం ఇది.. మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది.



5. నర్సో బావాడి

శ్రీ గురుడు 12 సం||తపసుచేసిన స్థలం,...

ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది.



6. గాణగా పూర్

శ్రీ గురుడు 23 సం. నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.



7. ఔదుంబర్

శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహరాష్ట్రులో ఉన్నది.

"చూడవలస స్థలం," బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.



8. మీరజ్

ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం కొల్హపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.



9. శ్రీశైలం

శ్రీ గురుడు అంతర్ధానమైన ప్రదేశం.

ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంట.. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు.

ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.



10. మూడవ దత్తావతారం..

మాణిక్య ప్రభువులు.

మాణిక్య నగర్ .. మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాది, ప్రభువుల వారి సంస్థానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది. తప్పక చూడవలసిన క్షేత్రము.



11. అక్కల్ కోట

నాలుగవ దత్తావతారం,

స్వామిసమర్ద (అక్కల్ కోటస్వామి ) సమాది మందిరం ఇది చెన్నయి - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు. తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.



12. ఏక ముఖ దత్తుని ఆలయం

ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు.



13. నాసిక్

ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది.



14. గిరినార్

ఇచ్చట దత్తపాదుకలు కలవు

ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది, ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లబిస్తుందని భక్తుల నమ్మకం.



15. షేగాం

ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాది మందిరం ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.



16. ఖేడ్గవ్

సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు.



17. ఖాండ్వా

శ్రీ దున వాలా దాదా వారి సమాదిమందిరం ఉంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.



18 మాన్ గవ్

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలోఉంది. ఇది చూడదగ్గ క్షేత్రం.



19. గరుడేశ్వర్

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాది మందిరం కలదు గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది ఇది తప్పక చూడవలసిన క్షేత్రం.



20. మౌంటు అబూ.

ఇచట దత్త శిఖరము కలదు. రాజస్తాన్ రాష్ట్రములో కలదు..

పైన తెలుపబడిన దత్త అవతారముల అయిదు క్షేత్రములు మరియు ఈ 1.నుండి 14 వరకు గల క్షేత్రములు దర్శించిన దత్త అనుగ్రహం తప్పక ఉండను. అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చను.


Tags: Dattatreya, Dattatreya Temples, India, Famous Temples Dattatreya, Lord Dattatreya, Dattatreya Pithapuram, Gangapur Dattatreya, famous Temples dattatreya
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock