పంచారామ క్షేత్రాలు ఉన్నట్లే సుబ్రహ్మణ్య స్వామి కి ఆరు పవిత్ర క్షేత్రాలు కలవు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడు లో సుబ్రహ్మణ్య స్వామి నివాసాలుగా అక్కడ చెబుతారు. తమిళనాట సుబ్రహ్మణ్యుడి ఆరాధనా ఎక్కువగా ఉంటుంది, వారు మురుగన్ అని పిలుస్తారు.
ఆ ఆరు క్షేత్రాలను తమిళనాడు లో ఆరుపడై వీడు క్షేత్రాలు అని పిలుస్తారు వీడు అంటే నివాసమని అర్ధం.
తిరుపరంకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పజముదిర్చోలై అనే ఆరు క్షేత్రాలు. తిరుపరంకుండ్రం , పజముదిర్చోలై మధురైకి దగ్గర్లో ఇంకా చెప్పాలంటే మదురై లోనే ఉన్నట్లు మనకు అనిపిస్తుంది లోకల్ బస్సు లు ద్వారా ఈ రెండు క్షేత్రాలను దర్శించి రావచ్చు.
ఈ ఆరుక్షేత్రాల గురించి నక్కీరర్ రచించిన తిరుమురుగత్రుపడై, అరుణగిరినాథర్ రచించిన తిరుప్పుగలో ప్రస్తావించబడ్డాయి. స్కాంద పురాణం లో ప్రకారం శూర పద్మన్ అనే రాక్షసుడు శివుని కుమారిని చేతిలో తప్ప ఇంక ఎవరి ద్వారా మరణం లేకుండా ఒక వరం పొందుతాడు.శూరపద్మన్ ఒకసారి దేవతలను స్వర్గం నుండి తరిమికొడతాడు. ఆ తరువాత ఏమి జరిగిందో ఒక్కోక్షేత్రం తో సుబ్రహ్మణ్య స్వామి కి ఎటువంటి సంబంధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రింద ఫోటో పై క్లిక్ చేస్తే ఆయా క్షేత్రాలు ఓపెన్ అవుతాయి .