వైకుంఠ ఏకాదశి కి టీటీడీ వారు ఏర్పాట్లు మొదలు పెట్టారు. 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 10 రోజులు పాటు శ్రీవారి భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఇప్పటికే జనవరి నెలకు విడుదల చేసిన 300/- దర్శనం టికెట్స్ లలో జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు టికెట్స్ విడుదల చేయలేదు. గత వైకుంఠ ఏకాదశికి 2.25 లక్షల 300/- దర్శనం టికెట్స్ విడుదల చేసారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి సమయం లో వీరికి ప్రత్యేక దర్శనాలు రద్దు :
చంటి పిల్లల తల్లిదండ్రులు దర్శనాలు రద్దు
వయోవృదులు వికలాంగుల దర్శనాలు రద్దు
ఆర్మీ , NRI దర్శలు రద్దు
లెటర్స్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాలు
ఆర్జిత సేవలు రద్దు
శ్రీవాణి టికెట్స్ పై వివరణ :
శ్రీవాణి టికెట్స్ తీసుకున్న వారికి మొదటి గడప దర్శనం ఇస్తారు, వైకుంఠ ఏకాదశి సమయం లో వీరికి కూడా అందరిలానే మహాలఘు దర్శనం అనగా జయ విజయుల దగ్గర నుంచే దర్శనం ఇస్తారు. కావున వీరు 10000 రూపాయల డొనేషన్ తో పాటు 500 రూపాయల బ్రేక్ దర్శనం కాకుండా 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాలి . వైకుంఠ ఏకాదశి సమయం లో శ్రీవాణి టికెట్ 10300 ఉంటుంది.
అన్నదాన సమయం లో మార్పు :
శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం సమయం లో మార్పు చేసారు వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నదానం చేస్తారు.
వైకుంఠ ఏకాదశి టికెట్స్ విడుదల తేదీ :
వైకుంఠ ఏకాదశి టికెట్స్ పై టీటీడీ ఇంకా స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు, మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం 16 తేదీన విడుదల చేస్తారని తెలుస్తుంది.
టికెట్ లేకపోతే దర్శనం ఉండదు :
వైకుంఠ ఏకాదశి సమయం లో దర్శనం టికెట్ లేని వారిని కొండపైకి వెళ్లనిస్తారు కానీ వారికి దర్శనం ఉండదు .
Keywords : Tirumala Vaikunta Ekadashi Tickets, Tirumala vaikunta ekadshi latest news